సినిమా రంగానికి పట్టిన చెదపురుగులు

 కథ ఉంది... కసి ఉంది... ఎలాగైనా ఒక మంచి సినిమా తీసి గెలవాలనే కల ఉంది!

కానీ, ఈ రోజుల్లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టడమే చిన్న నిర్మాతలు చేసిన పాపమా?


కలలతో వచ్చే అమాయక నిర్మాతలను ఆదుకుంటాం అంటూనే... లోపల ‘చెదపురుగుల్లా’ పొంచి ఉన్నారు కొందరు బ్రోకర్లు! కథ వినే దగ్గర నుండి, థియేటర్లలోకి సినిమా వెళ్లే వరకు... ప్రతి అడుగులోనూ కమిషన్ల దందా! కంటికి కనిపించకుండా ఇండస్ట్రీని కుదిపేస్తున్న బ్రోకర్ వెధవల మాయాజాలం ఇది.


చిన్న నిర్మాతల రక్తాన్ని జలగల్లా తాగుతూ, వారి జీవితాలను వైకుంఠపాళిలో పాముల్లా మింగేస్తున్న ఆ దగాకోరుల అసలు రంగును బయటపెట్టేందుకే... 


 ‘వైకుంఠపాళి’ ప్రత్యేక కథనం!


ఇది కేవలం వార్త కాదు... సర్వం కోల్పోయిన నిస్సహాయ నిర్మాతల‌ ఆక్రందన!

ఇది ఒకరి మోసం కాదు... 

ప్రతి వారం ఒక దెబ్బతిన్న నిర్మాత కన్నీటి గాథ!


- ఉమారావు

ఎడిట‌ర్,

వైకుంఠపాళి

సినిమా రంగానికి పట్టిన చెదపురుగులు సినిమా రంగానికి పట్టిన చెదపురుగులు Reviewed by VAIKUNTAPALLI LATEST NEWS UPDATES on July 12, 2026 Rating: 5

No comments:

Powered by Blogger.